Header Banner

ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం! కోర్టు తీర్పుపై ఉత్కంఠ!

  Thu May 01, 2025 10:52        Politics

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చెప్పిన ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి దాఖలు చేశారు. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

 

 

పిటిషనర్ తరఫున న్యాయవాది వాదిస్తూ.. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగాల్సిన అవసరం ఉందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అలానే జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన కోసం ప్రత్యేకంగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు.

 

 

ఇది కూడా చదవండిఏపీకి రూ.172 కోట్లతో మరో కొత్త మాల్! ఆ నగరంలో ఫిక్స్..!

 

కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అలాంటి అవకాశాన్ని ఇవ్వలేదన్నారు. ఇది అసమానత అని.. రాజ్యాంగ విరుద్ధం అంటూ ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తేడా చేయకూడదని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు.

 

కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజన్ మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన కోసం 2026 తర్వాత విడుదలయ్యే జనాభా లెక్కలు రావాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు" అని వివరణ ఇచ్చారు. ఆర్టికల్ 82లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ వ్యవస్థకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించబడ్డాయని కేంద్రం స్పష్టం చేసింది. జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే అసెంబ్లీ సీట్లను పెంచగలమని తేల్చిచెప్పింది. ఇక జమ్మూకశ్మీర్ విషయంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం చట్టపరమైనదే అని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ సూర్యకాంత్‌ తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

 

ఇది కూడా చదవండిప్లాట్ కొనుగోలుదారులకు భారీ ఊరట..! రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించిన ఏపీ ప్రభుత్వం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group





   #AndhraPravasi #SCVerdict #APTSSeats #SeatHike #Delimitation #APReorg #2026Census